పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా మొదలైన విషయం మనకు తెలిసిందే. ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా షూటింగ్ కొత్త భాగం పూర్తి అయిన తర్వాత ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నాడు. దానితో జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమా యొక్క దర్శకత్వ బాధ్యతలను స్వీకరించాడు. ఈయన గతంలో కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన రూల్స్ రంజన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ను నిర్వహించారు. అందులో భాగంగా హరిహర వీరమల్లు సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలను తెలియజేశారు. తాజాగా హరిహర వీరమల్లు మూవీ దర్శకుడు అయినటువంటి జ్యోతి కృష్ణ మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను ఒక్క సారి కాదు ఏకంగా మూడు సార్లు చూశారు. ఆ సినిమా చూసి నన్ను గంట సేపు ఎంతగానో పొగిడారు. అలాగే మళ్ళీ మీతో ఇంకో సినిమా కూడా చేయాలని ఉంది అని ఆయన చెప్పినట్లు జ్యోతి కృష్ణ తాజా ఈవెంట్లో భాగంగా చెప్పుకొచ్చాడు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" సినిమాను ఒక సారి కాకుండా మూడు సార్లు చూసి అద్భుతంగా ఉంది అని దర్శకుడుని ప్రశంసించినట్లు , అలాగే ఆయనతో మరోసారి సినిమా చేయాలి అని ఉంది అని చెప్పినట్లు ఈ మూవీ దర్శకుడు చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఏ ఏం రత్నం ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించగా ... ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: