ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో లోకేష్ కనకరాజు ఒకరు. లోకేష్ ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన , ఆయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవడంతో దర్శకుడిగా ఈయనకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఏర్పడింది. ఇకపోతే ఈయన చాలా కాలం క్రితం కార్తీ హీరో గా ఖైదీ అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ చివరన ఖైదీ మూవీ కి కొనసాగింపుగా ఖైదీ 2 ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దానితో ఖైదీ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎంతో మంది జనాలు ఎదురు చూస్తున్నారు. కానీ ఖైదీ మూవీ తర్వాత ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించిన ఖైదీ 2 మూవీను మాత్రం స్టార్ట్ చేయలేదు. కానీ ఖైదీ 2 మూవీ అప్పుడు స్టార్ట్ కాబోతుంది ..? ఇప్పుడు స్టార్ట్ కాబోతోంది అంటూ అనేక వార్తలు మాత్రం వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం లోకేష్ , రజనీకాంత్ హీరోగా కూలీ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఖైదీ పార్ట్ 2 ని స్టార్ట్ చేస్తారు అని వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ వార్తలు కూడా నిజం అయ్యేలా ప్రస్తుతం కనిపించడం లేదు.

అసలు విషయం లోకి వెళితే ... లోకేష్ తన తదుపరి మూవీ ని ఆమీర్ ఖాన్ తో చేసే అవకాశాలు ఉన్నట్లు , ఆ మూవీ ని వచ్చే సంవత్సరం మొదలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కానీ జరుగితే ఖైదీ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ కావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: