బిగ్ బాస్ టీవీ షో ద్వారా ఇప్పటికే ఎంతోమందికి అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే ఇండియాలో మొదటగా హిందీ లో బిగ్ బాస్ కార్యక్రమం మొదలు అయింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతీయ భాషల్లో కూడా ఈ టీవీ షో ప్రారంభం అయింది. హిందీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో కు అద్భుతమైన క్రేజ్ ఉంటుంది. దీనికి ఇండియా వ్యాప్తంగా వ్యూయర్స్ ఉండడంతో ఇందులోకి ఎంట్రీ ఇవ్వడానికి అనేక మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పటికే ఎంతో మంది హిందీ బిగ్ బాస్ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. ఇకపోతే హిందీ బిగ్ బాస్ సీజన్ 18 ఫేమ్ ఎడిన్ రోజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

ఈమె బిగ్ బాస్ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటికే ఈ బ్యూటీ పలు సినిమాలలో కూడా నటించింది. కొంత కాలం క్రితం రవితేజ హీరోగా రూపొందిన రావణాసుర మూవీ లో ఈమె స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. ప్రస్తుతం నయనతార నిర్మిస్తున్న LIK (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇలా ప్రస్తుతం నటిగా అద్భుతమైన జోష్లో కెరియర్ను కొనసాగిస్తున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె ప్రముఖ టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఈమె మాట్లాడుతూ ... నా మనసులో ఇప్పటికే నేను శ్రేయస్ అయ్యర్ ను పెళ్లి చేసుకున్నాను. నేను అతని పిల్లలకు తల్లిని అని నమ్ముతున్నాను. అతను నాకు అంతగా నచ్చడానికి కొన్ని బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఆయన మంచి ఎత్తుతో , చామన చాయ రంగులో ఉంటాడు. అలాగే ఎప్పుడూ అతను గడ్డంతో , కండలు తిరిగిన దేహం ను కలిగి ఉంటాడు. అందుకే అతను అంటే నాకు చాలా ఇష్టం అని తాజాగా ఎడిన్ రోజ్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: