టాలీవుడ్ నటుడు మంచు విష్ణు చాలా కాలం క్రితం కన్నప్ప అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ , హిందీ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అక్షయ్ కుమార్ , మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో పాటు మరికొంతమంది అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీనటులు ఈ మూవీ లో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాను జూన్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను కూడా మంచు విష్ణు ఇప్పటికే మొదలు పెట్టాడు. ఓ వైపు ఈ సినిమా ప్రచారాలు జరుగుతూ ఉంటే మరో వైపు ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీ పై గుంటూర్ కి సంబంధించిన బ్రాహ్మణ సంఘాలు ఆందోళనకు దిగాయి. సినిమాలో పిలక అనే పదాన్ని వాడారు అని వారు ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ ను ఎవరో కొట్టేశారు అని , అందులో ఈ సినిమాకు సంబంధించిన చాలా ఫుటేజ్ ఉంది అని , అలాగే ఆ హార్డ్ డిస్క్ లో ప్రభాస్ కు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి అని వార్తలు వచ్చాయి.

మరి ఇప్పటివరకు కన్నప్ప సినిమాకు సంబంధించి దొంగలించబడిన హార్డ్ డిస్క్ దొరికిందా ..? లేదా అనే దానిపై కూడా పెద్దగా సమాచారం లేదు. కానీ ఓ వైపు మంచు విష్ణు మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున చేస్తున్నాడు. అలాంటి సమయంలో తాజాగా ఈ మూవీ పై గుంటూరుకు సంబంధించిన బ్రాహ్మణ సంఘాలు కూడా ఆందోళనకు దిగారు. మరి ఇలా ఈ సినిమాకు సంబంధించి అనేక వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: