
ఈ విషయాన్ని చాలామంది డైరెక్టర్ లు ఓపెన్ గానే చెప్పుకు వచ్చారు. నందమూరి బాలయ్య చాలా చాలా మంచి వ్యక్తి అని.. ఇంటికి వెళితే చాలా మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకుని .. స్టోరీ వింటారు అని.. స్టోరీ నచ్చకపోతే కూడా చాలా సున్నితంగా రిజెక్ట్ చేస్తారు అని .. స్టోరీ నచ్చితే మాత్రం వెంటనే యాక్సెప్ట్ చేసి అగ్రిమెంట్ పై సైన్ చేస్తాడు అని.. చాలా ఇంటర్వ్యూలలో కొంతమంది డైరెక్టర్ లు చెప్పుకొచ్చారు . అయితే బాలయ్య దగ్గర నుంచి కాల్ షీట్స్ తీసుకోవాలి అంటే మాత్రం ఒకే ఒక్క మాట చెబితే వెంటనే అది వర్కౌట్ అయిపోతుందట .
బాలయ్య కి మొదటి నుంచి కూడా యాక్షన్ సినిమాలు అన్న ..ఫ్యాక్షన్ సీన్స్ అన్న మహా మహా ఇష్టమట . ఏ డైరెక్టర్ అయినా సరే ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో కచ్చితంగా యాక్షన్ సీన్స్ ఉండే విధంగా రాసుకొని వచ్చి.. మాస్ డైలాగ్స్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి అంటే మాత్రం వెంటనే మిగతా స్టోరీ వినకుండా అక్కడికక్కడ అగ్రిమెంట్ పేపర్ పై సైన్ చేసేస్తాడట. బాలయ్యకి యాక్షన్ సీన్స్ అంటే అంత ఇష్టం . తొడకొట్టడాలు సుమోలు లేపేడాలు ఇలాంటి సీన్స్ ఇండస్ట్రీలో బాలయ్య చేస్తేనే చూడాలి అనిపిస్తుంది. మిగతా హీరోలు చేస్తే జుజుబీ లు లా కనిపిస్తారు . బాలయ్య తప్పితే అలా ఫ్యాక్షన్ రోల్స్ లో మరి ఏ హీరో కూడా సూట్ కారు. ప్రసెంట్ అఖండ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు బాలయ్య..!!