కోలీవుడ్ నటుడు సూర్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూర్య ఈ మధ్య కాలంలో వరస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న ఆయన నటించిన సినిమాలు పెద్ద స్థాయిలో విజయాలను అందుకోవడం లేదు. తాజాగా సూర్య , కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన రేట్రో అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం సూర్య , ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇది ఇలా ఉంటే చాలా కాలం క్రితమే సూర్య , వెట్రీ మారన్ దర్శకత్వంలో వడి వసూల్ అనే టైటిల్ తో రూపొందబోయే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది అని వార్తలు కూడా వచ్చాయి. అలాంటి సమయం లోనే ఈ మూవీ ఆగిపోయింది అని  ,కాకపోతే స్థానంలో ఆ మూవీ నిర్మాతలకు మరో సినిమా చేయడానికి వేట్రి మారన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని అందులో భాగంగా శింబు హీరోగా వేట్రి మారన్ ఓ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే అది స్టార్ట్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ఇలా వార్తలు వస్తున్న సమయంలో ఈ తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... సూర్య , వేట్రి మారన్ కాంబోలో మూవీ క్యాన్సల్ కాలేదు అని , మరికొన్ని రోజుల్లోనే ఆ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది అని వార్తలు వచ్చాయి. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో వేట్రి మారన్ ఒకరు. అలాంటి దర్శకుడి సినిమాలో శింబు కి అవకాశం వచ్చింది అని వార్త బయటకు రావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారట. కానీ ఆ ప్రాజెక్టు లేదు అని వార్తలు రావడంతో శింబు అభిమానులు కాస్త డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: