టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు . పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఎన్నో సినిమాలు ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిం దే . అలా పవన్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ రికార్డులను కూడా సృష్టించిన సందర్భాలు ఉన్నాయి . తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన మరో బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో తొలిప్రేమ మూవీ ఒకటి. పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఈ మూవీ లో కీర్తి రెడ్డి హీరోయిన్గా నటించగా ... కరుణాకరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దేవా ఈ సినిమాకు సంగీతం అందించాడు. 1998 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా పవన్ , కీర్తి రెడ్డి లకు అద్భుతమైన గుర్తింపు లభించింది. 

అలాగే ఈ సినిమా ద్వారా దర్శకుడిగా కరుణాకరన్ కు కూడా మంచి క్రేజ్ లభించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు తొలిప్రేమ మూవీ ని జూన్ 1 వ తేదీన భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ ఫైరల్ అవుతుంది. మరి రీ రిలీజ్ లో భాగంగా తొలిప్రేమ సినిమా ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: