
అప్పటినుంచి డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే చాలామంది హీరోలు భయపడుతున్నారు. కమల్ హాసన్ క్లిష్టమైన పరిస్థితిలో ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ల థగ్ లైఫ్ సినిమాతో ఇటీవలే నిలదొక్కుకున్న కలెక్షన్స్ అనుకున్నంత స్థాయిలో రాబట్టలేకపోతున్నది. ఒకవేళ ఈ సినిమా ఫలితం సానుకూలంగా ఉంటే.. దీపావళి లేదా దసరాకి ఇండియన్ 3 సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టినప్పటికీ తాజాగా కమలహాసన్, శంకర్ ఈ సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఈ సినిమాని ఓటీటి కే అమ్మేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తే కచ్చితంగా డిజాస్టర్ అవుతుందని అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. ఒకవేళ ఓటిటి డీల్ సెట్ కాకపోతే ఈ సినిమాలో పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాలేని పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. డైరెక్టర్ మణిరత్నం కూడా నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తో పెద్ద హిట్ కొట్టాలని భావిస్తున్నారట మణిరత్నం. మరి కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ చేస్తున్న ఈ ప్లాన్ రిస్క్ అని చెప్పవచ్చు. మరి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.