హీరోల సెంటిమెంట్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ అభిమానుల మనోభావాలు గమ్మత్తుగా ఉంటాయి .. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ..ఈ క్రమంలో ఈ సినిమా చుట్టూ ఓ సెంటిమెంట్ వైరల్ గా మారింది .. ఆ స్టోరీ ఎంటో ఇక్కడ చూద్దాం .. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ వినిపిస్తుంది .. కానీ దీనిపై అధికారికంగా సినిమా యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు .. అలాగే ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది .. ఇక ఇందులో ఎన్టీఆర్ నటించే పాత్రకు చైనీస్ గ్యాంగ్ స్టార్ స్టర్ జావో వెయ్ క‌థ‌ ఆధారమని కూడా తెలుస్తుంది .. ఇలా ఎన్టీఆర్ ఈ సినిమాలో డాన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు 'బాద్ షా', జై లవకుశ సినిమాలో కూడా ఎన్టీఆర్ డాన్ గా కనిపించి అలరించారు ..


అయితే ఈ రెండు సినిమాల కలెక్షన్ల విషయంలో అభిమానులు అంతగా ఆనంద పడలేదు తర్వాత డాన్ ను పోలిన పాత్రలోనే జనతా గ్యారేజ్లో కనిపించి ఆకట్టుకున్నారు ఎన్టీఆర్ .. దీంతో ఇప్పుడు వచ్చే డ్రాగన్ ఎలా ఉంటుంది అన్న ఇంట్రెస్ట్ అభిమానుల్లో బాగా పెరిగింది . ఇదే క్రమంలో నందమూరి నట‌కుటుంబంలో డాన్ పాత్రలు బాగా కలిసి వచ్చాయని అభిమానులు ఓ వార్తను బయటకు తీశారు .. ముందుగా నటరత్న ఎన్టీఆర్ డాన్ గా నటించిన భలే తమ్ముడు మ్యూజికల్ గా హిట్ గా నిలవడమే కాదు కాకుండా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది .. ఆ తర్వాత నటించిన మగాడు అంతగా మెప్పించలేకపోయింది ఆ తర్వాత ఆయన డాన్ గా నటించిన యుగంధర్ కలెక్షన్ల వర్షం కురిపించింది .. ఇక ఎన్టీఆర్ డాన్ గా గజదొంగలోనూ ప్రేక్షకులను మెప్పించారు .. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది ..


ఇక ఇప్పుడు అదే రూట్ లో జూ . ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ కూడా గత సినిమాలకన్నా మరింత విజయం సాధిస్తుందని అభిమానులు ఆశపడుతున్నారు . అలాగే ఇక నందమూరి కుటుంబంలో నటరత్న ఎన్టీఆరే కాదు అయ‌న‌ నట వారసుడు బాలకృష్ణ సైతం కొన్ని సినిమాల్లో డాన్ పాత్రలో నటించి మెప్పించాడు .. బాలయ్య మొదటిసారి యువరత్న రానా లో డాన్ గా నటించారు .. కంటి చూపుతో స్టాచించే లెజెండ్ లో బలే నటించి అదరగొట్టారు ఈ సినిమా 1000 రోజులకు పైగా ఆడి అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేసింది .. అందువల్ల ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సైతం డాన్ క్యారెక్టర్ తో ప్రేక్షకులను మెప్పిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు .. ఇక 2026  వేస‌విలో ప్రేక్షకుల ముందు ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ మూవీ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: