టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతాఇంతా కాదు. ఈ మధ్య కాలంలో బాలయ్య హీరోగా నటించి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సులువుగానే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తున్నాయి. యాక్షన్ సినిమాల లవర్స్ ను మెప్పించే విధంగా బాలయ్య సినిమాలు ఉన్నాయి. బాలయ్య పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.
 
ఒక్కో సినిమాకు బాలయ్య పారితోషికం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఈరోజు సాయంత్రం అఖండ2 మూవీ నుంచి టీజర్ విడుదల కానుండగా బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే. ఈ కాంబోలో తెరకెక్కే సినిమా వీరసింహారెడ్డి సినిమాను మించి ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
 
అయితే బాలయ్య ఫ్లాప్ సినిమాలు సైతం ఎమ్మిగనూరు ఏరియాలో కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఫ్యాన్స్ ఈ విషయంలో భళా బాలయ్య అంటూ బాలయ్యకు మాత్రమే ఆ ఏరియాలో సంచలనాలు సృష్టించడం సాధ్యమని కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య నటించిన మహారథి లాంటి ఫ్లాప్ సినిమాలు సైతం ఇక్కడ హిట్ గా నిలవడం కొసమెరుపు.
 
బాలయ్య ఫ్లాప్ సినిమాలే ఈ స్థాయిలో ఆడాయంటే హిట్ సినిమాలు ఏ స్థాయిలో ఇక్కడ ఆడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలలో యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా ఉండేలా బాలయ్య తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తే బాలయ్య 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం కష్టమేం కాదు. అఖండ2 టీజర్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటే బాలయ్య రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అఖండ2 రిలీజ్ డేట్ గురించి కూడా మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: