తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నాగ చైతన్య ఒక రు . కొంత కాలం క్రితం నాగ చైతన్య తమిళ దర్శకు డు అయినటు వంటి వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ అనే సినిమా లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్గా నటించగా ... అరవింద స్వామి ఈ మూ వీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది . ఈ మూవీ తర్వాత వెంకట్ ప్రభు తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరో గా రూపొందిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే వెంకట్ ప్రభు తాజాగా తన తదుపరి మూవీ ని ఓకే చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులను ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ హీరోగా వెంకట్ ప్రబు తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా వెంకట్ ప్రభు ఓ స్టోరీని శివ కార్తికేయన్ కి వినిపించగా , అది బాగా నచ్చడంతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో మూవీ చేయడానికి శివ కార్తికేయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలబడనున్నట్లు , ఇకపోతే శుభ కార్తికేయన్ , వెంకట్ ప్రభు కాంబోలో రూపొందబోయే సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: