
ఈ మధ్యకాలంలో చాలామంది అసలు పేర్లు కన్నా ముద్దు పేర్లు పెట్టుకొని పిలుచుకుంటూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు జన్మ నక్షత్ర ప్రకారం పెట్టిన పేరు కన్నా కూడా ముద్దు పేర్లుగా పెట్టుకున్న పప్పీ..బుజ్జి..హనీ..కన్నా..రోసీ అని ఇలానే పిలుచుకుంటూ ఉంటున్నారు . అయితే జ్యోతిష పండితులు మాత్రం అలా తమ తల్లిదండ్రులు జన్మ నక్షత్రం చూసి పెట్టిన పేరు ప్రకారం పిలవకపోతే అది వాళ్ళకి నెగటివ్గా మారుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు అది వాళ్ళ కెరియర్ ఎదుగుదలకు నెగిటివ్గా మారుతుంది అంటూ చెబుతున్నారు.
అయితే నందమూరి ఫ్యామిలీలో మాత్రం చాలామంది జన్మ నక్షత్ర ప్రకారం పట్టిన పేరుతోనే పిలుచుకుంటూ ఉంటారు . చిన్న పిల్లలైనా పెద్ద వాళ్ళు అయినా ఎవరైనా సరే. కానీ అభిమానులు మాత్రం నందమూరి బాలయ్యని ముద్దు పేరుతో పిలవడానికే ఇష్ట పడతారు. అప్పుడప్పుడు సరదాగా ముద్దుగా ముద్దు పేరుతో పిలుచుకుంటూ ఉంటారు . కానీ బాలయ్యకి ముద్దు పేరుతో పిలవడం కన్నా తన నాన్నగారు పెట్టిన అసలు పేరుతో పిలవడమే ఇష్టం . కొంతమంది ఫ్యాన్స్ కూడా నందమూరి బాలయ్యను ముద్దుగా ముద్దు పేరుతో పిలుచుకుంటూ ఉంటారు.
చాలా మంది అభిమానులు బాలయ్య ని నటసింహం అని .. నందమూరి టైగర్ అని పిలుచుకుంటూ ఉంటారు . చాలా మంది డైరెక్టర్స్ బాలయ్యను బాల బాల అంటూ ముద్దుగా పిలుస్తారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులలో చాలామంది కూడా బాలయ్యను బాల అంటూ ముద్దుగా పిలుస్తారట. ఈ విషయం ఓ ఇంటర్వ్యూలో బయటపడింది . అయితే బాలయ్యకు మాత్రం బాల అని పిలవడం కన్నా బాలకృష్ణ అని పిలవడమే ఎక్కువగా ఇష్టం. కానీ చాలామంది జనాలు బాల అని బాలయ్య అంటూ మాత్రమే పిలుస్తారు . బాలకృష్ణ అని ఎవరో రేర్ గా మాత్రమే పిలుస్తూ ఉంటారు . మరికొద్ది గంటల్లో బాలయ్య పుట్టినరోజు వేడుకలు స్టార్ట్ కాబోతున్నాయి . దీంతో సోషల్ మీడియాలో బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్తలను మరొక్కసారి ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు..!!