టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను జూలై 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. కానీ ఈ సినిమాను జూలై 4 వ తేదీన విడుదల చేసే అవకాశం లేదు అని ఓ వార్త వైరల్ అవుతుంది.

దానితో ఈ మూవీ ని ఆగస్టు 1 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , ప్రస్తుతం అందుకు తగిన పనులు జరుగుతున్నట్లు , అన్ని ఓకే అయితే ఈ సినిమాను ఆగస్టు 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఓవర్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు చాలా మంచి స్నేహితుడు.

తారక్ ప్రస్తుతం వార్ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో కింగ్డమ్ సినిమాను ఆగస్టు 1 వ తేదీన విడుదల చేసినట్లయితే వార్ 2 సినిమాకు పోటీ అయ్యే అవకాశం ఉంటుంది. దానితో నాగ వంశీ , తారక్ సినిమాకు అంత దగ్గరగా కింగ్డమ్ సినిమాను విడుదల చేయడం కష్టం అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd