కోలీవుడ్ నటుడు ధనుష్ తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... నాగార్జునమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాను జూన్ 20 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన పనులను వేగవంతంగా ఈ మూవీ బృందం వారు పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను , కొన్ని పాటలను మేకర్స్ విడుదల చేశారు. అవి అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇకపోతే ఈ సినిమా బుక్ మై షో యాప్ లో కూడా అద్భుతమైన స్థాయిలో రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. బుక్ మై షో యాప్ లో ఈ మూవీ ఇప్పటికే 150 కే ఇంట్రెస్ట్ లను అందుకుంది. ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులు మిగిలి ఉంది. ఆ లోపు ఈ మూవీ బుక్ మై షో ఆప్ లో మరిన్ని ఇంట్రెస్ట్ లను సాధించి , అద్భుతమైన ఇంపాక్ట్ ను బుక్ మై షో యాప్ లో చూపించే అవకాశం ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా కూడా ధనుష్ , శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతున్న సినిమా కావడం , అందులో నాగార్జున కీలకమైన పాత్రలో కనిపించనుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: