సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో సక్సెస్ అయ్యాడు అంటే కచ్చితంగా అది ఆ హీరో సక్సెస్ అని చెప్పుకోకూడదు . ఆ హీరోని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ లు.. నటీనటుల సక్సెస్ అనే చెప్పాలి . ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే కేవలం హీరో ఉంటే సరిపోదు టెక్నీషియన్స్ ..డైరెక్టర్ లు.. ప్రొడ్యూసర్ లు.. మ్యూజిక్ డైరెక్టర్ హీరోయిన్స్ అందరూ కూడా కరెక్ట్ గా సెట్ అవ్వాలి . అప్పుడే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది . మరీ ముఖ్యంగా హీరోయిన్ పాత్ర ఎంతైనా ఉంటుంది. హీరోలు ఎలా అన్న నటించేస్తారు కానీ ఒక హీరో కి కన్వీనెంట్గా ఒక హీరోయిన్ ఉండగలిగితేనే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండుతుంది . రొమాంటిక్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ బాగా వర్కౌట్ అవుతాయి .

ఆ కారణంగానే చాలామంది సినిమాలో హీరోకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో హీరోయిన్ కి అంతే ప్రాధాన్యం ఉండేలా స్టోరీ రాసుకుంటూ ఉంటారు . మరి ముఖ్యంగా బాలయ్య నటించిన సినిమాలల్లో ఎక్కువగా హీరోయిన్స్ ఎమోషనల్ సీన్స్ లో నటిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడే పక్క వాళ్ళు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు . అంటే ఇప్పుడు బాలయ్య ఎమోషనల్ గా ఆ సీన్స్ లో 100 కి 100 శాతం న్యాయం చేయగలగాలి అంటే కచ్చితంగా ఎదుట ఉన్న హీరోయిన్ అంతే 100% సపోర్ట్ చేయాలి. లేకపోతే బాలయ్య ఎంత బాగా నటించినా ఆ సీన్స్ వర్క్ అవుట్ అవ్వవు.

మరి ముఖ్యంగా ఒక అప్పట్లో హీరోయిన్ సిమ్రాన్ - బాలయ్య కాంబో ఆకట్టుకునింది . వేరే లెవెల్ క్రేజీ హిట్స్ వీళ్ళ ఖాతాలో పడ్డాయి.  వెంకటేష్ - సౌందర్యల కాంబో ఎంత హైలెట్ అయ్యిందో.. అంత కి ట్రిపుల్ రేంజ్ లో బాలయ్య - సిమ్రాన్ కాంబో హైలెట్ అయ్యింది. వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా  సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి . అయితే అప్పట్లో సిమ్రాన్ బాలయ్య కెరియర్నే మార్చేసింది.  బ్యాక్ టు బ్యాక్ సిమ్రాన్ కి పోటా పోటీగా బాలయ్య కూడా స్టెప్స్ వేస్తూ థియేటర్స్ కి వచ్చిన ముసలోళ్ల సైతం విజిల్స్ వేయించేలా సిమ్రాన్  - బాలయ్య చేశారు .

ఆ తర్వాత అలాంటి క్రేజీ కామెంట్స్ దక్కించుకున్న జంట మాత్రం బాలయ్య - నయనతార కాంబోనే అని చెప్పాలి . వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు మంచి హిట్టు అందుకున్నాయి. అంతేకాదు వీళ్ళ కాంబో అభిమానులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది . బాలయ్య సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న చర్చకు వస్తే మాత్రం నూటికి నూరు శాతం మంది నందమూరి అభిమానులు నయనతార పేరునే  నేటి కాలంలో సజెస్ట్ చేస్తున్నారు అంటే బాలయ్య - నయన్ ల కాంబో అభిమానులకు ఎంత నచ్చేసిందో అర్థం చేసుకోవచ్చు . ఒక అప్పట్లో సిమ్రాన్ బాలయ్య లైఫ్ని మార్చేస్తే ఇప్పుడు నయనతార బాలయ్య టోటల్ కెరీయర్ నే మలుపు తిప్పేస్తుంది . త్వరలోనే రాబోతున్న క్రిష్-బాలయ్య కాంబో సినిమాలో కూడా హీరోయిన్గా నయనతారనే హీరోయిన్ గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!


మరింత సమాచారం తెలుసుకోండి: