
కానీ బాలయ్య లైఫ్ లో జరిగిన్న కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఆయనను భయపెట్టేసాయ్. అది కూడా ఆదివారం రోజే. దీంతో ఒక సెంటిమెంట్ ని బలంగా బలయ్య నమ్మాల్సి వచ్చింది. తన కెరియర్లో ఒక సెంటిమెంట్ ని ఆ తర్వాత ఒక నమ్మకంలా భావిస్తూ వచ్చారు. ఆదివారం అంటే బాలయ్యకు బాగా డేంజర్ అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఆదివారం నాడు బాలయ్య బ్లాక్ కు సంబంధించిన ఏ దుస్తులను వేసుకొనే వేసుకోరు . దానికి కారణం ఆయనకు ఒక సెంటిమెంట్ బలంగా నమ్మడమే . నిజజీవితంలో ఓ సెంటిమెంట్ బాలయ్య బాగా ఫాలో అవుతూ వస్తున్నాడు . ఆదివారం రోజు నలుపు రంగు బట్టలు అస్సలు ధరించరు బాలయ్య .
ఒకవేళ అలా ధరిస్తే జరగకూడనిది ఏదైనా జరుగుతుంది అనే నమ్మకం . ఈ విషయాన్ని స్వయానా బాలయ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు. " నాది మూలా నక్షత్రం . ఆదివారం నలుపు మంచిది కాదు అని ఎంతో మంది పండితులు చెప్పారు . ప్రఖ్యాతి దేవతలు ఉంటారని నమ్ముతాను . అందుకే ఆదివారం నలుపు ధరించను. అయితే ఓసారి మాత్రం ఆదిత్య 369 షూటింగ్ సమయంలో డైరెక్టర్ నలుపు వేసుకోవాలి అంటూ పట్టుదల తో మొండిగా కూర్చున్నాడు. నాకు ముందే తెలిసిపోయింది ఏదో నష్టం జరగబోతుంది అని ..అందుకే ఆ కలర్ వద్దు అని ముందే చెప్పా . అయినా అదే రోజు బాలసుబ్రమణ్యం కూడా సెట్ కి వచ్చారు. అయితే అప్పుడు ఆయన కళ్ళముందే కింద పడిపోయి ..నడుము విరిగింది. ఆయన రావడం వల్లే అలా జరిగిందనుకొని మళ్ళీ షూటింగ్లోకి రాలేదు పాపం. చాలా కంగారు పడిపోయారు. కానీ అది ఎందుకో నాకు ముందే తెలుసు. అందుకే ఆదివారం నలుపు జోలికి పోను నేను. ఇప్పటికీ ఆదివారం నలుపు రంగు దుస్తులు ధరించను " అంటూ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇంత పెద్ద స్టార్ సెలబ్రిటీ కూడా సెంటిమెంట్ ఫాలో అవుతాడా..? అంటూ కొంతమంది వెటకారంగా కామెంట్స్ చేస్తే మరి కొంత మంది మాత్రం బాలయ్య నిజాయితీ నమ్మకాన్ని ప్రశంసిస్తున్నారు..!