కొన్ని సందర్భాలలో వరుస పెట్టి కొంత మంది హీరోలకు విజయాలు అందించిన దర్శకులు ఒక్కో సందర్భంలో కొం త మంది హీరోలకు మాత్రం అపజయాలను కూడా అందిస్తూ ఉంటారు . అలా ఓ దర్శకుడు టాలీవుడ్ ఇం డస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలు అయినటువంటి చిరంజీవి , బాలకృష్ణ కు మంచి విజయాలను అందిం చే పవన్ కళ్యాణ్ కు మాత్రం అపజయాన్ని అందించాడు. అసలు ఆ విషయం ఏమిటో తెలుసుకుందాం. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా జయంతి సి పరంజీ దర్శకత్వంలో శంకర్ దాదా ఎంబిబిఎస్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. 

మూవీ హిందీలో విజయం సాధించిన లగే రహో మున్నాభాయ్ అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం నందమూరి నట సింహం బాలకృష్ణ "లక్ష్మీ నరసింహ" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు కూడా జయంతి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి సామి మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది.

మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. కొంత కాలం క్రితం హిందీలో మంచి విజయం సాధించిన లవ్ అజ్ కల్ మూవీ ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా తీన్మార్ అనే టైటిల్ తో రీమేక్ చేశాడు. ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ఈ ముగ్గురు హీరోలతో సినిమాలను రీమిక్ చేసిన ఈ దర్శకుడు చిరు , బాలయ్య కు హిట్స్ ఇచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ కు హిట్స్ ఇవ్వలేకపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: