తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి మంచు విష్ణు తాజాగా కన్నప్ప అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ , అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ వంటి అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులు నటించారు. ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో విష్ణు వరుస పెట్టి ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు.

తాజాగా విష్ణు ఓ ఇంటర్వ్యూ లో భాగంగా ఈ సినిమా ఓ టీ టీ డీల్ గురించి అదిరిపోయే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మంచు విష్ణు ఈ సినిమా ఓ టీ టీ డీల్ గురించి మాట్లాడుతూ ... కొంత కాలం క్రితం కన్నప్ప సినిమా ఓ టీ టీ హక్కుల కోసం ఓ ప్రముఖ డిజిటల్ సంస్థ వారు మమ్మల్ని సంప్రదించారు. కానీ వారు మా సినిమాకు ఇచ్చిన ఆఫర్ నాకు నచ్చలేదు. దానితో నేను వారిని ఒక ప్రశ్న అడిగాను. ఒక వేళ ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే మీరు ఎంత ఇస్తారు అని అడిగాను. దానితో వారు ఒక నెంబర్ చెప్పారు.

నాకు అది బాగా నచ్చింది. దానితో మీరు చెక్ రెడీ చేసుకోండి. సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాక అదే రేటుకు మీరు కన్నప్ప సినిమాను కొనుక్కోండి అని చెప్పాను అని మంచు విష్ణు తాజాగా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతానికి కన్నప్ప మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: