
గత రాత్రి జరిగిన అఖిల్ , జైనబ్ వెడ్డింగ్ రిసెప్షన్ కు తన కుటుంబం తో హాజరయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ కార్యక్రమం లో అందరికంటే ఎంతో భిన్నంగా సింపుల్ గా టీషర్ట్ వేసుకొని ఫంక్షన్ కు వచ్చేసాడు .. అయినా కూడా తన అందం క్రేజ్ కారణం గా మహేష్ అందరికన్నా ఎంతో ఆకర్షణంగా నిలిచాడు. ఇదే సమయంలో మహేష్ వేసుకున్న సింపుల్ టీ షర్ట్ పై కొందరు ఆరా తీశారు అతని అభిమానులు. అయితే చూడడానికి ఎంతో సింపుల్ గా కనిపించిన ఆ టీ షర్ట్ సాదాసీదాది కాదు . దాని ఖరీదు అక్షరాల 1, 54 ,800 రూపాయలు .. తన ఫ్యామిలీ తో కలిసి ఎప్పటికప్పుడు విదేశీ టూర్లకు వెళుతుంటాడు మహేష్ ..
అలా వెళ్ళినప్పుడు షాపింగ్ కూడా చేస్తాడు .. అలా విదేశాల్లో కొన్నదే ఈ టీషర్ట్ .. హెర్మిస్ కంపెనీకి చెందిన ఈ టీషర్ట్ ఇప్పుడు మహేష్ అభిమానుల కు ఎంతో హాట్ టాపిక్ గా మారింది . అలాగే ఈ టీషర్ట్ తో పాటు తన లుక్ ను మరోసారి బయటపెట్టాడు సూపర్ స్టార్ రాజమౌళి సినిమా కోసం అతను ఈ లుక్ లోనే కనిపించబోతున్నాడు .. ఇదే ఫైనల్ లుక్కని అంటున్నారు . మహేష్ , ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ సినిమా కు సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తయింది . అయితే ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చారు . ఇవ్వాళ్లి నుంచి మళ్లీ హైదరాబాదులో మరో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు .. ఈ షెడ్యూల్లో మరో నటుడు మాధవన్ కూడా అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు