నిన్న విడుదలైన అఖండ2 టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ సినిమా టీజర్ కు ఏకంగా 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే అఖండ2 టీజర్ పై ఫ్యాన్స్ రియాక్షన్ మాత్రం మరోలా ఉంది. టీజర్ లో థమన్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నా డైలాగ్స్ ను డామినేట్ చేసింది. థమన్ మ్యూజిక్ మరీ డామినేట్ చేసే విధంగా ఉండవద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
అఖండ2 సినిమా టీజర్ లో రక్తంకు సంబంధించిన షాట్ దేవర గ్లింప్స్ షాట్ ను పోలి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈ షాట్ పై కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఇలాంటి షాట్స్ ఒకటి రెండు ఉంటే ఇబ్బంది లేదు కానీ ఎక్కువగా ఉంటే అఖండ2 సినిమాకు మైనస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
నందమూరి బాలకృష్ణను ఈ సినిమాలో గత సినిమాలతో పోలిస్తే పవర్ ఫుల్ గా చూపించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్యసినిమా కోసం 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. బాలయ్య ఒక సినిమా పూర్తైన వెంటనే మరో సినిమాలో నటిస్తున్నారు. ఏడాదికి ఒక సినిమాను లేదా రెండు సినిమాలను బాలయ్య రిలీజ్ చేస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
 
అఖండ2 సినిమా సక్సెస్ సాధించడం బోయపాటి శ్రీను కెరీర్ కు సైతం కీలకం అనే సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నారు. అఖండ2 సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. అఖండ2 సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. స్టార్ హీరో  బాలయ్య రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలను సృష్టించాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: