ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన వైరస్లలో కరోనా ఒకటి. మొదట ఈ వైరస్ చైనాలో ప్రారంభం అయింది. చైనాలో కరోనా వైరస్ వచ్చింది , దాని వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అన్న సమయంలో భారత దేశ ప్రజలు ఆ వైరస్ మన దేశం దాకా రాదు. వచ్చిన మన ప్రాంతంలో జనాలను అది ఏమీ చేయలేదు అని అనేక మంది అభిప్రాయ పడ్డారు. కానీ మెల్లి మెల్లిగా అది ఇండియాలోకి వచ్చింది. రావడం మాత్రమే కాకుండా ఇండియా లోని అనేక మంది ప్రాణాలను కూడా కరోనా బలి తీసుకుంది. దానితో అనేక కాలం పాటు కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తం లాక్ డౌన్ ను విధించింది. దానితో కాస్త కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి.

ఇక దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ టీకాలను కూడా పెద్ద ఎత్తున వేయించారు. ఇకపోతే ఇంత కాలం పాటు కరోనా చప్పుడు పెద్దగా వినబడలేదు. మళ్లీ కరోనా ఇండియా లోకి వచ్చేసింది. కానీ ప్రజలు పెద్దగా దానిని పట్టించుకోవడం లేదు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. అది చాప కింద నీరులా ప్రవహిస్తుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ కరోనా క్రియాశీలక కేసుల సంఖ్య 6000 దాటినట్లుగా ప్రకటించింది. ఆదివారం సాయంత్రం నాటికి కరోనా క్రియాశీలక కేసుల సంఖ్య 6133 దాటినట్లుగా కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాజాగా 48 గంటల్లో 769 కొత్త కరుణ కేసులు దేశ వ్యాప్తంగా నమోదు అయినట్లు ప్రకటించింది.

ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు కేరళలో నమోదు అయ్యాయి. ఆ తర్వాత స్థానాలలో గుజరాత్ ,  పశ్చిమ బెంగాల్ , ఢిల్లీ ఉన్నట్లు తెలిపింది. ఇలా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. దానితో అనేక మంది వైద్య నిపుణులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని , అనేక జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: