ప్రపంచ వ్యాప్తంగా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో రాజమౌళి ఒకరు. రాజమౌళి ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. రాజమౌళి చాలా కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగించాడు. ఇక బాహుబలి సిరీస్ మూవీలతో ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకున్నారు. రాజమౌళి ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాకు దర్శకత్వం వహించి ఈ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు హీరో గా రాజమౌళి సినిమాను రూపొందిస్తున్నాడు. ఇంత గొప్ప క్రేజ్ కలిగిన దర్శకుడి సినిమాలో అవకాశం వస్తే ఎగిరి గంతేసి ఎవరైనా ఒప్పుకుంటూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం రాజమౌళి సినిమా ఆఫర్లను కూడా రిజెక్ట్ చేశారు. ఆ నటీ నటులు ఎవరో తెలుసుకుందాం.

రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన మగధీర సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సలోని పాత్రకు మొదట అర్చన ను అనుకున్నారట. అందులో భాగంగా అర్చన ను సంప్రదిస్తే ఈమె ఆ పాత్రను చేయను అని రిజెక్ట్ చేసిందట. ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సిరీస్ మూవీలు రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రమ్యకృష్ణ పాత్రకి మొదట శ్రీదేవి ని అనుకున్నారట. కానీ ఈమె ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట. ఇక ప్రస్తుతం రాజమౌళి , మహేష్ బాబు హీరోగా ఓ మూవీ ని రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో మొదట తమిళ నటుడు విక్రమ్ ను రాజమౌళి అనుకున్నాడట. కానీ ఆయన ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. దానితో రాజమౌళి ఆ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: