రీసెంట్ గానే అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకున్నాడు.  తన గర్ల్ ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అఖిల్ . ఈ పెళ్లి వేడుక చాలా చాలా ఘనంగా జరిగింది. మొదట చాలా సింపుల్గా పెళ్లి చేసుకున్న అఖిల్ -జైనబ్.. ఆ తర్వాత గ్రాండ్గా రిసెప్షన్ ఇచ్చారు. ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరూ వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.  చాలా సాంప్రదాయ బద్ధంగా అక్కినేని నాగార్జున - అమల ..అఖిల్ - జైనబ్ పెళ్లి జరిపించారు .

మరి ముఖ్యంగా వేల కోట్ల ఆస్తి ఉన్న సరే చాలా సింపుల్గా అఖిల్ - జైనబ్ పెళ్లి జరగడంపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి . అయితే ఇది టోటల్ జైనబ్ - అఖిల్ అంగీకారం మీద జరిగినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.  అంతేకాదు అఖిల్ - జైనబ్  పెళ్లి ఫొటోస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి.  మరీ ముఖ్యంగా 33 ఏళ్ల క్రితం  నాగార్జున - అమల ఏవిధంగా సింపుల్గా పెళ్లి చేసుకున్నారో సేమ్ టు సేమ్ అదే విధంగా పెళ్లి చేసుకోవడం అఖిల్ - జైనబ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా వైరల్ అవుతుంది.

వైట్ కలర్ దుస్తుల్లో అమల - నాగార్జున చాలా సింపుల్ పద్ధతిలో తమ పెళ్ళి చేసుకున్నారు . సేమ్ టు సేమ్ అఖిల్ - జైనబ్  కూడా అత్తమామల ని ఫాలో అవుతూ వైట్ కలర్ బట్టల్లోనే మెరిశారు. అఖిల్ పట్టు పంచె కట్టుకుని ట్రెడిషనల్ గా కనిపిస్తే జైనబ్  పట్టు చీరలో చాలా అందంగా కనిపించింది . అచ్చం నాగార్జున - అమలనే గుర్తు చేశారు ఈ జంట అంటూ పొగిడేస్తున్నారు అక్కినేని అభిమానులు . సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళిద్దరి  పెళ్లి ఫోటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . 33 ఏళ్ల సీన్ రిపీట్ అయ్యింది అని..దేవుడికి తెలుసు ఎప్పుడు ఏం కావాలో.. ఎప్పుడు ఎలా చేయాలో అంటూ అక్కినేని అఖిల్ లైఫ్ ను బ్లెస్ చేస్తున్నారు.  ఇక అక్కినేనిఫ్యామిలీకి అన్ని గోలెడన్ డేస్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: