నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొంత కాలం క్రితం వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిం దే . ఈ మూవీ 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అ య్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుం  ది . ఈ మూవీ తర్వాత బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబో లో మరో మూ వీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అనేక వార్తలు వచ్చాయి.

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 మూవీ లో హీరో గా నటిస్తూ ఉండగా ... గోపీచంద్ మలినేని తాజాగా హిందీ నటుడు సన్నీ డియోల్ హీరోగా జాట్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కొంత కాలం క్రితమే విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇకపోతే బాలకృష్ణ తదుపరి మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తో గోపీచంద్ మలినేని ఈ సారి ఓ హిస్టారికల్ పౌరాణిక చిత్రం రూపొందించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఆఖరుగా బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో గౌతమి పుత్ర శాతకర్ణి అనే సినిమాతో హిస్టారికల్ పౌరాణిక సినిమాలో నటించాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని , బాలకృష్ణ తో అలాంటి ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా మంచి విజయం సాధించడంతో బాలయ్య అభిమానులు గోపీచంద్ మలినేని , బాలకృష్ణ తో తీయబోయే పౌరాణిక సినిమా కూడా అద్భుతమైన విజయం సాధిస్తుంది అని అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: