కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్యూయల్ రోల్ ట్రెండ్ అద్భుతమైన రీతిలో ముందుకు సాగింది. చాలా మంది హీరోలు ఒకే సినిమాలో రెండు పాత్రలలో నటించి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరాల పాటు ఈ ట్రెండ్ చాలా వరకు తగ్గిపోయింది. మళ్లీ ఈ ట్రెండ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెరిగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు వరుస పెట్టి తమ సినిమాల్లో రెండు పాత్రల్లో నటించడానికి ప్రస్తుతం ఇష్టపడుతూ వస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే.

మూవీ లో తారక్ ఒక పాత్రలో తండ్రిగా , మరొక పాత్రలో కొడుకుగా నటించి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కూడా ఒక పాత్రలో తండ్రిగా , మరొక పాత్రలో కొడుకుగా నటించాడు. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టిన చరణ్ మాత్రం ఈ మూవీలోని రెండు పాత్రల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో చిరంజీవి కూడా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి మూవీ ని అట్లీ తో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో అల్లు అర్జున్ కూడా రెండు పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మన టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం డ్యూయల్ రోల్ లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: