డాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరియర్లు మొదలు పెట్టి ఆ తర్వాత నటుడి గా , దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో రాఘవా లారెన్స్ ఒకరు. ఈయన ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం సినిమాల్లో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాఘవ లారెన్స్ "బెంజ్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న లోకేష్ కనకరాజు కథను అందించాడు. బిక్కియ్య రాజ్ కన్నన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితం ప్రారంభం అయింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... బెంజ్ మూవీ లో రాఘవా లారెన్స్ కు జోడిగా ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురిని ఇప్పటికే మేకర్స్ ఫైనల్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఆ ముగ్గురు కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణులు కావడం విశేషం. రాఘవా లారెన్స్ హీరో గా రూపొందుతున్న బెంజ్ మూవీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీమణులు అయినటువంటి సంయుక్త మీనన్ , ప్రియాంక ఆరుల్ మోహన్ మరియు మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఏకంగా ముగ్గురు మంచి క్రేజ్ ఉన్న నటీమణులు బెంజ్ మూవీ లో హీరోయిన్లుగా కనిపించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాఘవ లారెన్స్ హీరో గా నటిస్తున్న మూవీ కావడం ఆ సినిమాకి లోకేష్ కనకరాజు కథను అందిస్తూ ఉండడంతో బెంజ్ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: