గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చరణ్ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ , చరణ్ తో చేయబోయే సినిమా కథను మొదట పవన్ కళ్యాణ్ కు వినిపించినట్లు , పవన్ కళ్యాణ్ కు ఆ సినిమా కథ అద్భుతంగా నచ్చిన ప్రస్తుతం రాజకీయ పనులతో చాలా బిజీగా ఉండడంతో ఈ సినిమా చేయలేని పరిస్థితి ఏర్పడినట్లు , దానితో ఆ కథకు రామ్ చరణ్ అయితే అద్భుతంగా సూట్ అవుతాడు అని త్రివిక్రమ్ కి ఆ కథతో రామ్ చరణ్ తో సినిమా చేయండి అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అని సలహా ఇచ్చినట్లు , ఆ సలహా మేరకు త్రివిక్రమ్ ఆ కథను రామ్ చరణ్ కు వినిపించగా ఆయనకు కూడా ఆ కథ నచ్చడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

పవన్ కోసం రెడీ చేసిన కథతో త్రివిక్రమ్ , చరణ్ తో చేయబోతున్నాడు అని వార్తలు బయటకు రావడంతో పవన్ అభిమానులతో పాటు చరణ్ అభిమానులు ఓ వైపు అనంత పడుతూనే మరో వైపు కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది. టెన్షన్ ఎందుకు అనుకుంటున్నారా ..? రామ్ చరణ్ కొంత కాలం క్రితం శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కథ తయారు అయిన తర్వాత శంకర్ ఈ కథతో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా చేద్దాం అనుకున్నాడట. కానీ ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు మాత్రం ఆ కథ పవన్ కళ్యాణ్ కంటే చరణ్ పై అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అని సలహా ఇచ్చాడట.

ఆ సలహా మేరకు చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ ని రూపొందించగా , ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి మరోసారి పవన్ కోసం తయారు చేసిన కథలో చరణ్ నటించనున్నాడు అని వార్తలు బయటకు రావడంతో గేమ్ చేంజెర్ సెంటిమెంట్ ఏమైనా రిపీట్ అవుతే ఎలా అని చరణ్ ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: