
కానీ బాలయ్య ఫాన్స్ బాలయ్య పుట్టినరోజు ను ఓ రేంజ్ లో హంగామా చేస్తూ సెలబ్రేట్ చేస్తున్నారు. భారీ భారీ కేకులు కట్ చేసి భారీ భారీ కటౌట్లతో ఫ్లెక్సీలతో జై బాలయ్య జై జై బాలయ్య అండ్ రచ్చ రంబోలా చేసేస్తున్నారు. ఇలాంటి మూమెంట్లోని సోషల్ మీడియాలో బాలయ్యకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . నందమూరి హీరో బాలయ్య 65 ఏళ్లు వచ్చిన సరే ఇంత ఫిట్ గా ఉండడానికి కారణం ఆయన తీసుకునే ఫుడ్ డైట్ అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తల ను ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు .
బాలయ్య మొదటి నుంచి ఒకే టైప్ అఫ్ ఫుట్ ని కంటిన్యూగా తీసుకుంటూ వస్తున్నారు అని.. మరీ ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆయన సపరేట్ డైటీషియన్స్ ని ఇలా ఎవరిని నియమించుకోలేదట. ఆయన ప్రొడక్షన్లో ఏ ఫుడ్ దొరుకుతుందో అదే ఫుడ్ తింటూ వస్తారట . ఇప్పటికి బాలయ్య ప్రొడక్షన్ ఫుడ్నే తింటూ వస్తున్నారు. ఈ విషయాన్ని బాలయ్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు . ఇంటి పక్కన షూటింగ్ జరుగుతున్న భార్య క్యారియర్ పంపిస్తాను అన్న అసలు ఒప్పుకోడట . అందరూ తినే ఫుడ్ నే తింటాను ప్రొడక్షన్ ఫుడ్ ఏ మహా ప్రసాదం అంటూ ప్రొడక్షన్లో దొరికే ఫుడ్ నే ఇష్టంగా తింటారట . అంతేకాదు కచ్చితంగా ఆయన ఫుడ్ లో రాగి సంగటి అనేది ఉండేలా చూసుకుంటారట . ఎక్కువగా నీళ్లు కూడా తాగుతూ వస్తారట . మరి ముఖ్యంగా ఉదయాన్నే లేవగానే యోగా చేయడం ఆయన కచ్చితంగా పాటిస్తూ వస్తారట. ఇలాంటి మంచి అలవాట్లు ఉన్న కారణంగానే 65 ఏళ్లు వచ్చిన బాలయ్య ఇంకా ఫిట్గా రాయిలా ఉన్నాడు అంటున్నారు అభిమానులు..!