ఈరోజు నందమూరి బాలకృష్ణ 65 వ జన్మదిన సందర్భంగా బాలయ్య అభిమానులు చాలా చోట్ల తన పుట్టినరోజున  చాలా గ్రాండ్గా హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా ఈసారి బాలయ్య బర్త్డే చాలా స్పెషల్.. ఎందుకంటే బాలకృష్ణ పేరు ముందు పద్మభూషణ్ చేరడంతో అభిమానులు తెగ సంబరపడిపోతూ చేస్తున్నారు. ఒకరకంగా 2025లో 50 ఏళ్ల నట ప్రస్తావనం కూడా బాలకృష్ణ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక కరెక్ట్ సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ఇచ్చి గౌరవించడంతో అభిమానులు ఒక పండుగలా చేసుకుంటున్నారు.



ఇందులో భాగంగా తిరుమలలో ఈ రోజున అఖిలాండం వద్ద బాలయ్య పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరిపారు. టిడిపి పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఈ వేడుకలను  చేశారు. దీంతో అక్కడ భక్తులను కూడా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది సుమారుగా 650 కొబ్బరికాయలు పగలగొట్టినట్లు తెలుస్తోంది. అలాగే 6.5 కిలోల కర్పూరంతో చాలా గ్రాండ్గా హారతి ఇచ్చారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయంపై టిడిపి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ..


బాలయ్య సినిమాలతో పాటు బసవతారకం హాస్పిటల్ ద్వారా చాలామంది ప్రజలు అద్భుతమైన వైద్యాన్ని అందుకున్నారని ఆయన ఆయుఆరోగ్యాలతో ఉంటూ మరిన్ని సేవలు అందించాలని తిరుపతి వెంకన్నకు ప్రార్థిస్తున్నామంటూ తెలియజేయడం జరిగింది. అయితే ఈ వేడుకలలో సుబ్బు, రుశేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా తిరుపతిలో చేసిన ఈ పని హైలెట్గా నిలిచింది. బాలయ్య అభిమానులు కూడా ఈ వేడుకలను చాలా వైరల్ గా చేస్తున్నారు.


ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. అఖండ 2 సినిమాలో నటించడమే కాకుండా డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో కూడా మరొక సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: