ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులలో అద్భుతమైన ప్రదర్శన ను కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ అవార్డ్స్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిం దే . ఇకపోతే ఈ అవార్డ్స్ ను జిల్లాల వారీగా విభజించి ఏ జిల్లాలో ఎంత మం ది అద్భుతమైన ప్రదర్శనను కనబరిచా రో వారందరికీ ఇచ్చారు . ఇందులో ప్రభుత్వ పాఠశాల లో చదివిన విద్యార్థులతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల లో చదివిన వారికి కూ డా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ అవార్డ్స్ ను ఇచ్చా రు. దీనితో ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థుల కంటే కూడా ప్రైవేట్ కళాశాలలో చదివిన విద్యార్థులకే అధికంగా అనేక జిల్లాలలో షైనింగ్ అవార్డ్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

దీనితో అనేక మంది ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. వారికి సరైన సదుపాయాలు కూడా ఉండవు. అలాంటి పరిస్థితులలో కూడా వారు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు అంటే వారు గొప్పవారు. కానీ ప్రైవేటు కళాశాలలో చదివే వారికి అనేక వసతులు ఉంటాయి. వారికి చదువుకోవడానికి అనుకూల వాతావరణం కూడా పెద్ద ఎత్తున ఉంటుంది.

అలాంటి అనేక వసుతులు కలిగిన విద్యార్థులతో పోటీ పడి ప్రభుత్వ కళాశాలలో చదివిన వారు ప్రదర్శనను కనపరచడం కాస్త కష్టమైన విషయం. అలాంటి వారితో కలిపి వీరికి కూడా అవార్డులు ఇవ్వడం ఏమిటి ..? అలా ఇవ్వడం వల్లనే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థుల కంటే ప్రైవేట్ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎక్కువ మంది షైనింగ్ అవార్సులు గెలుపొందారు. అలా కాకుండా కేవలం ప్రభుత్వ కళాశాలలో చదివిన వారికి మాత్రమే షైనింగ్ అవార్డ్స్ ఇచ్చినట్లయితే వారి ప్రతిభను అద్భుతమైన రీతిలో గుర్తించిన వారు అవుతారు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: