
ఏఎస్ రవికుమార్ చౌదరి హార్ట్ ఎటాక్ కారణంగా మృతి చెందినట్లు ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. గాడ్ ఆఫ్ మాసెస్ గా పిలుచుకునే నట సిం హం నందమూరి బాలకృష్ణ తో ఆయన అనుబంధం విడదీయరానిది . వీళ్ల కాంబోలో "వీర భద్ర" సినిమా వచ్చింది. మరీ ముఖ్యంగా బాలకృష్ణతో పాటు యంగ్ హీరోస్ నితిన్ - సాయి తరుణ్ తేజ్ - గోపీచంద్ , రాజ్ తరుణ్ లాంటి తదితరుల స్టార్స్ తో సినిమాలు చేసి ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు .
జూన్ 10వ తేదీ రాత్రి ఆయనకు గుండెపోటు వచ్చింది అని అప్పుడే ఆయన మరణించాడు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆయన మరణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది . కాగా గత కొన్ని రోజుల నుంచి ఏఎస్ రవికుమార్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది . దర్శకుడిగా ఆయన చేసిన చివరి సినిమాలు పరాజయ పాలు కావడం వల్లే మానసికంగా చాలా ఇత్తిడికి లోనయ్యారు అని మరొక పక్క ఇండస్ట్రీలో సన్నిహితులుగా ఉన్నవారు కూడా ఆయన దూరం పెట్టడంతో ఆయన ఇంకా ఇంకా డిప్రెషన్ కి లోనైన్నట్లు స్నేహితులు చెప్పుకొస్తున్నారు.
గోపీచంద్ కథానాయకుడిగా నటించిన "యజ్ఞం" సినిమాతో రవికుమార్ దర్శకుడిగా పరిచయమయ్యారు . ఆ తర్వాత ఆటాడిస్తా. ఏం పిల్లోడు పిల్లడో , పిల్ల నువ్వు లేని జీవితం .. ఇలాంటి మంచి సినిమాలు తెరకెక్కించిన ఆయన మన మధ్య ఇప్పుడు లేడు అని తెలిసి ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. బాలకృష్ణతో వీరభద్ర అనే సినిమా తెరకెక్కించాడు ఈయన. కానీ ఈ సినిమా అనుకున్నంత ఫలితం దక్కించుకోలేకపోయింది. కానీ బాలయ్యకు మాత్రం ఫేవరెట్ వన్ ఆఫ్ ది ఫేవరేట్ డైరెక్టర్గా మారిపోయాడు ఏఎస్ రవికుమార్. అలాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ మన మధ్య లేడు అన్న విషయం తెలుసుకుని ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..!