టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. ఈయన సుమంత్ హీరో గా రూపొందిన మళ్లీ రావా అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకొని దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా జెర్సీ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈయనకు దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది.

ఇకపోతే ఈయన ఆ తర్వాత జెర్సీ మూవీ ని హిందీ లో జెర్సీ టైటిల్ తోనే షాహిద్ కపూర్ హీరోగా మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా రూపొందించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇది ఇలా ఉంటే చాలా కాలం క్రితం గౌతమ్ , విజయ్ దేవరకొండ హీరోగా ఓ మూవీ సెట్ చేసుకున్నాడు. కానీ ఆ సినిమా కాస్త డిలే కావడంతో అంతా కొత్త వాళ్ళతో మ్యాజిక్ అనే మూవీ ని చాలా తక్కువ టైమ్ లో గౌతమ్ రూపొందించాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిన ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం చాలా స్లో గా జరుగుతున్నట్టు తెలుస్తుంది.

ఆ మధ్యలో ఈ సినిమా విడుదల తేదీ అది ... ఇది అంటూ అనేక వార్తలు వచ్చాయి. మళ్లీ ఈ సినిమా ఊసే లేకుండా పోయింది. ఇకపోతే ప్రస్తుతం గౌతమ్ పూర్తిగా తన ఫోకస్ ను కింగ్డమ్ పై పెట్టేశాడు. ప్రస్తుతం కింగ్డమ్ సినిమా పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే కింగ్డమ్ సినిమా విడుదల అయ్యాకే మ్యాజిక్ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. కింగ్డమ్ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gt