పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉన్న మరొకవైపు అభిమానుల కోసం సినిమాలు చేస్తే బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసినప్పటికీ కూడా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఏళ్ల తరబడి సినిమా షూటింగులు వాయిదా పడుతున్నాయి. ఇటీవలే కాలంలో వరుసగా సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్ . అందుకే నిర్మాతలతో మీటింగ్ పెట్టి మరి ఆగస్టు కల్లా సినిమాలను పూర్తిచేసేలా ప్లానింగ్ చేస్తున్నారట. అందుకే బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమా షూటింగులు చేస్తూ పూర్తి చేసే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది.


మొదట హరిహర వీరమల్లు సినిమా కు డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తిగా చేశారు. ఈనెల 26న  రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత OG సినిమా కోసం రెండు వారాల వరకు డేట్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ని పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లోకి అడుగుపెట్టినట్లుగా తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది.



మైత్రి మూవీస్ మేకర్స్ వారు, డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తేరి సినిమాకి రీమెక్కుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా హిందీలో రీమేక్ చేయగా  ఫ్లాప్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాకి పూర్తిగా కథను మార్చేసి మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని  పొలిటికల్ టచ్ ఉండేలా డైరెక్టర్ హరిశంకర్ తీస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారంటూ అలాగే ఈ వీడియోలో శ్రీలీల కూడా చూపించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: