
ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా దర్శకుడు తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. లయ నితిన్ సోదరి పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు పోరాటం చేస్తున్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమా విషయంలో ఖర్చు విషయంలో రాజీ పడలేదు.
ఈ మధ్య కాలంలో నితిన్ సినిమాలకు భారీ కలెక్షన్లు రాకపోవడానికి ఇతర సినిమాలతో పోటీ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అయితే తమ్ముడు సినిమాకు మాత్రం ఆ సమస్య లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తమ్ముడు సినిమా ప్రమోషన్స్ త్వరలో మొదలుకానున్నాయి. సినిమా విడుదలకు చాలా సమయం ఉన్నా ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా సినిమాపై అంచనాలు పెంచండంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. తమ్ముడు మూవీ కమర్షియల్ గా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు