టాలీవుడ్ లో చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ద్వారా బారి పాపులారిటీ సంపాదించుకుంది నటి ఆవికా గోర్. ఆ తర్వాత అదే క్రేజ్ తో పలు సీరియల్స్ లో సినిమాలలో హీరోయిన్గా నటించింది ఈ ముద్దుగుమ్మ. మొదట ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఆవికా గోర్. ఆ తర్వాత సినిమా చూపిస్తా మామ, రాజు గారి గది 3, లక్ష్మీ రావే మా ఇంటికి తదితర చిత్రాలలో నటించింది. తెలుగులోనే కాకుండా కన్నడ ,హిందీ వంటి భాషలలో కూడా నటించింది ఈ అమ్మడు.



తాజాగా ఆవికా గోర్ తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకొని సడన్ షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ ఒక పోస్ట్ ను షేర్ చేసింది. గత కొంతకాలంగా మిలింద్ చంద్వాని అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నది. త్వరలోనే ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యానని ఈ మేరకు ఇన్స్టా లో ఫోటోలను షేర్ చేసింది. తన ప్రేమ విషయంపై నోరు తెరిచి అడగగా తాను సంతోషంగా ఏడ్చానని ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నా అన్నట్లుగా తెలియజేసింది. మొత్తానికి మా కళ నెరవేరినట్టుగా కనిపిస్తోంది అంటూ
ఆవికా గోర్ వెల్లడించింది.

ఎప్పుడైతే అతను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారో అప్పుడే తాను గాలుల్లో తేలిపోయారని కళ్ళనిండా నీటితో మెదడులో ఎలాంటి ఆలోచన లేకుండా ఓకే చెప్పానని నిజమైన ప్రేమ అంటే ఇదే కదా ప్రేమలో అన్నీ కూడా ఫర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు కానీ అందులో మ్యూజిక్ వేరు అంటూ ఫోటోలకు క్యాప్షన్ జత చేసింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం మొదట ఆశ్చర్యపోయిన ఆ తర్వాత కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు. చివరిగా ఆవికా గోర్ షణ్ముఖ నటించిన ఒక చిత్రంలో అలరించింది. ఈ మధ్యకాలంలో సినిమాలలో కూడా పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: