సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ప్రస్తుతం కూలీ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నటిస్తున్న మూవీ కావడం , అందులో నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండడం ఆ మూవీ కి ఇండియా వ్యాప్తంగా క్రేజ్ కలిగిన లోకేష్ కనకరాజు దర్శకత్వ వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలబడి ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమీర్ ఖాన్ ఓ చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నట్లు అనేక రోజులుగా వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా అమీర్ ఖాన్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. తాను రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమాలో ఓ చిన్న క్యామియో పాత్రలో నటిస్తున్నాను అని చెప్పాడు.

అలాగే  ఎందుకు ఆ సినిమాలో చిన్న క్యామియో పాత్రలో నటిస్తున్నాను అనే విషయాన్ని కూడా తాజాగా చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ ... నాకు రజినీ కాంత్ సార్ అంటే చాలా ఇష్టం. అలాగే అతనిపై ఎంతో గౌరవం మరియు అభిమానం. అలాగే ఆయన అంటే ఎంతో ప్రేమ. అందుకే రజనీ కాంత్ సార్ హీరోగా రూపొందుతున్న కూలీ సినిమాలో చిన్న క్యామియో పాత్ర అని లోకేష్ చెప్పగానే కథ కూడా వినకుండా ఆ మూవీ లో పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు. రజినీ కాంత్ సార్ పై ఉన్న గౌరవంతోనే కూలీ సినిమాలో క్యామియో పాత్రలో నటించడానికి ఒప్పుకున్నాను అని ఆమీర్ ఖాన్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: