యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 అనే హిందీ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తోనే తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో తారక్ తో పాటు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో మూవీ లో కూడా హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తారక్ వరుస పేట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి నాగ వంశీ బ్యానర్లో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం ఓ సినిమా ఈవెంట్లో భాగంగా తారక్ మాట్లాడుతూ ... నాగ వంశీ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. కానీ అది స్టార్ట్ కావడానికి కాస్త సమయం పడుతుంది అని చెప్పుకొచ్చాడు. దానితోనే అర్థం అయ్యింది నాగ వంశీ బ్యానర్లో తారక్సినిమా చేయబోతున్నాడు అని. ఇకపోతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తారక్ హీరోగా ఓ మూవీ మరికొంత కాలంలో స్టార్ట్ కానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ ని కూడా నాగ వంశీ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తారక్ వరుస పెట్టి నాగ వంశీ బ్యానర్లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉండడంతో చాలా మంది నాగ వంశీ ఈ మధ్య కాలంలో మంచి హిట్ సినిమాలను నిర్మిస్తున్నాడు. అందుకే తారక్ , నాగ వంశీ బ్యానర్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: