నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి అద్భుతమైన విజయాలను అందుకుంటున్న విషయం మన అందరికీ తెలుస్తుంది. కొంత కాలం క్రితం బాలయ్య చాలా అపజయాలను ఎదుర్కొన్నాడు. అలాంటి సమయం లోనే బాలయ్య టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

సినిమా తర్వాత బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి , బగవంత్ కేసరి , డాకు మహారాజ్ సినిమాలు వరుస పెట్టి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇలా అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకుంటూ బాలయ్య అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తూ వెళ్లడంతో ఆయన అభిమానులు కూడా గత కొంత కాలంగా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇలా ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్న సమయంలో ఓ సినిమా మాత్రం బాలయ్య అభిమానులను కాస్త డిసప్పాయింట్ చేసినట్టు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న అందరికీ మన తెలిసిందే. అందులో భాగంగా బాలయ్య కొంత కాలం క్రితం నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ అయినటువంటి లక్ష్మీ నరసింహ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రిలీజ్ లో భాగంగా భారీ స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేకపోయింది.

మూవీ నార్త్ అమెరికాలో కేవలం 3000 డాలర్స్ కలెక్షన్లను మాత్రమే రీ రిలీజ్ లో భాగంగా రాబట్టగా , ఓవరాల్ గా ఇండియాలో ఈ సినిమాకు 12 నుండి 15 లక్షల రేంజ్ లో మాత్రమే కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా బాలయ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో లక్ష్మీ నరసింహ సినిమా రీ రిలీజ్ అయిన కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపకపోవడంతో బాలయ్య అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: