
అయితే కొంతమంది పవన్ అభిమానులు ఫ్రస్టేషన్ తో వీరమల్లు రివ్యూ అంటూ సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా 4.9 రేటింగ్ ఇస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ఈ విధంగా వీరమల్లు విషయంలో తమ అసంతృప్తిని అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు విడుదలైనా సంచలనాలు సృష్టించే సినిమా అవుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమాగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. దాదాపుగా 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకున్న తర్వాత స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేసారని తెలుస్తోంది. హరిహర వీరమల్లు బాక్సాఫీస్ ను షేక్ చేయాలనీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
హరిహర వీరమల్లు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వీరమల్లు సినిమాలో కథ పరంగా వచ్చే మలుపులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా పవన్ కెరీర్లో బిగెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను బట్టి సినిమా ఎలా ఉండబోతుందో అంచనాకు రావచ్చు. వీరమల్లు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలవుతాయో చూడాల్సి ఉంది.