
ఇక అందులో ఒకటి టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ హీరోగా వస్తున్న కుబేర కాగా .. మరొకటి లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ .. అయితే ఈ రెండు సినిమాల్లో నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు .. అయితే తాజాగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కుబేర , కూలీ సినిమాల్లో చేస్తున్న పాత్రలు రెండు పూర్తిగా ఎంతో భిన్నంగా ఉంటాయని చెప్పుకొచ్చాడు.. అలాగే ఈ రెండు సినిమాలు చూసేక ఆడియన్స్ కచ్చితంగా ఎంతో కొత్తగా ఫీల్ అవుతారని .. అదే విధంగా ఈ రెండు పాత్రలు తనకు మంచి స్ఫూర్తిని ఇచ్చాయని నాగార్జున చెప్పుకొచ్చారు ..
అలాగే తాను కూలీ సినిమాలో సైమన్ అనే చాలా కీలకమైన పాత్రలో నటించానని .. లోకేష్ తనకు కూలీ సినిమా విజువల్స్ చూపించాడని .. ఆ విజువల్స్ ఎంతో ఊహించని విధంగా అనిపించాయని ఆ సినిమా లో లోకేష్ తనను ఎంతో స్టైలిష్ గా ప్రజెంట్ చేశారని .. అదేవిధంగా లోకేష్ ఎంతో గొప్ప డైరెక్టర్ అని కూలీ సినిమా మొత్తం ప్రేక్షకులని విజిల్స్ వేసే సీన్లు ఎన్నో ఉంటాయని నాగార్జున చెప్పుకొచ్చారు .. అలాగే కుబేరలో కూడా తన పాత్ర ఎంతో కొత్తగా ఉంటుందని .. శేఖర్ తన క్యారెక్టర్ ను ఎంతో కొత్తగా డిజైన్ చేశారని .. ఈ సినిమా ఎంతో రియలిస్టిక్ గా తెర్కక్కించాడు .. ఇక మరి ఈ రెండు సినిమాలతో నాగార్జున బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి .