రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో చిన్న సినిమాలతో మంచి విజయాలను అందుకొని దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను ఏర్పరచుకున్న మారుతీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తూ ఉండగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో , ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

ఇకపోతే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే చాలా కాలమే అవుతున్న ఈ సినిమా నుండి మూవీ బృందం అత్యంత తక్కువ అప్డేట్లను మాత్రమే విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను జూన్ 16 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇకపోతే ఈ మూవీ టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న వేళ ఈ మూవీ టీజర్ ఆన్లైన్ లో ఎవరు లీక్ చేసేసారు. దీనితో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ క్లిప్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ క్లిప్స్ కానీ , టీజర్ కానీ ఎవరి సోషల్ మీడియా హ్యాండ్ లో అయిన కనిపిస్తే వారి సోషల్ మీడియా అకౌంట్ ను సస్పెండ్ చేస్తాము అని గట్టి వార్నింగ్ ఇచ్చింది.

ఇకపోతే ప్రస్తుతానికి రాజా సాబ్ టీజర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ లో ప్రభాస్ కి జోడి గా నీది అగర్వాల్ ,  మాళవిక మోహన్ , రీద్ధీ కుమార్ లు హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: