
శివ సినిమా వర్మ కెరియర్లో సైతం స్పెషల్ మూవీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎప్పుడు రీరిలీజ్ అయినా సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శివ సినిమా రీరిలీజ్ లో సైతం సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగార్జున సైతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆగష్టు నెల 29వ తేదీ నాగ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.
నాగ్ పుట్టినరోజు అంటే అభిమానులకు పండగ రోజు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి రికార్డులను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. నాగ్ పారితోషికం సైతం గత కొన్నేళ్లలో భారీ స్థాయిలో పెరిగింది. కుబేర, కూలీ సినిమాలకు ఆయన రికార్డ్ స్థాయిలో ఛార్జ్ చేశారని తెలుస్తోంది. నాగ్ కెరీర్ ప్లాన్స్ మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయి.
అక్కినేని నాగార్జున రాబోయే రోజుల్లో గెస్ట్ రోల్స్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారేమో చూడాలి. శివ సినిమా రీరిలీజ్ వెర్షన్ కు మంచి రెస్పాన్స్ వస్తే నాగ్ నటించిన మరిన్ని సినిమాలు థియేటర్లలో రీరిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నాగ్ వర్మ కాంబోలో శివ తర్వాత మరిన్ని సినిమాలు తెరకెక్కినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. ఇతర భాషల్లో సైతం నాగార్జునకు ఫ్యాన్స్ ఉన్నారు.