టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని తాజాగా బాలీవుడ్ మాస్ హీరోలలో ఒకరు అయినటువంటి సన్నీ డియోల్ హీరో గా జాట్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం కేవలం హిందీ భాషలో మాత్రమే థియేటర్లలో విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది.

సినిమా కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా గ్లోబల్ గా కూడా అద్భుతమైన ఇంపాక్ట్ ను ఓ టి టి ప్లాట్ ఫామ్ లో చూపిస్తున్నట్లు తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ఫ్లాట్ ఫామ్ వారు అనౌన్స్ చేశారు. జాట్ మూవీ నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో వరల్డ్ వైడ్ గా టాప్ 4 లో ట్రెండ్ అవుతున్నట్లు , అలాగే టాప్ 10 లో అయితే మొత్తం 17 దేశాల్లో ట్రెండింగ్ లో ఉన్నట్లు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇలా జాట్ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో అద్భుతమైన రేంజ్ లో రెస్పాన్స్ ను దక్కించుకున్నట్లు  నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి రెజీనా ఈ మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: