కాంతర చాప్టర్ 1 షూటింగ్ జరుగుతున్నప్పటినుండి ఈ సినిమాకి సంబంధించి దాదాపు ముగ్గురు వ్యక్తులు మరణించిన సంగతి మనకు తెలిసిందే. వివిధ కారణాలతో ఈ ముగ్గురు మరణించారు.ఇక రీసెంట్గా ఈ సినిమాలో నటించిన విజు వీకె అనే జూనియర్ ఆర్టిస్ట్ కూడా మరణించడంతో కాంతార మూవీ యూనిట్లో నటించే వారికి భయం పట్టుకుంది. అయితే ఆ మధ్యకాలంలో రిషబ్ శెట్టి ఓ జాతరలో పాల్గొన్న టైంలో పంజుర్లీ దేవత రిషబ్ శెట్టిని హెచ్చరించింది. నీ ముందు దుష్టశక్తులు తిరుగుతున్నాయని, వారు అందరూ నీకు శత్రువులే అని, కానీ నీవు నమ్ముకున్న దేవుడే నిన్ను కాపాడతాడని,ఎంతోమంది నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారంటూ హెచ్చరించింది. అలాగే నీవు నమ్ముకున్న దేవుడే నీకు సాయం చేస్తాడు అంటూ కూడా పంజుర్లీ చెప్పింది.

దాంతో ఆరోజు పంజూర్లీ దేవత చెప్పిన జోస్యం చాలా వైరల్ అయింది. అయితే తాజాగా రిషబ్ శెట్టి చావు అంచుల వరకు వెళ్లి బతికి బయటపడ్డట్టు తెలుస్తోంది.. కాంతార చాప్టర్ 1 షూటింగ్లో భాగంగా రిషబ్  శెట్టి తో పాటు మరో 30 మందిని నటీనటులు సినిమా షూటింగ్లో భాగంగా నిన్న రాత్రి కర్ణాటకలోని మాణి జలాశయంలో షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో రిషబ్ శెట్టితో పాటు 30 మంది నటీనటులు, సిబ్బంది ఆ పడవలో షూట్ చేస్తున్నారు. ఆ టైంలో సడన్గా బోటు నీళ్లలో మునిగిపోయింది. కానీ అప్రమత్తమమైన రిషబ్ శెట్టి, 30 మంది నటీనటులు, సిబ్బంది అందరూ కూడా త్వర త్వరగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. ఇక ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పెను ప్రమాదం నుండి బయటపడ్డారు.

ఒకవేళ నీటిలో మునిగిపోయిన వారిలో ఎవరో ఒక్కరికి ఈత రాకపోయినా కూడా కాంతార చాప్టర్ వన్ లో చేసే వారిలో మరొక వికెట్ డౌన్ అయ్యేది. ఇప్పటికే ముగ్గురు చనిపోయారు. తాజాగా పెను ప్రమాదం నుండి కాంతార చాప్టర్ 1 మూవీ నటీనటులు బయటపడ్డారు. ఇదంతా చూస్తూ ఉంటే ఏదో గందరగోళం గానే ఉంది అని కర్ణాటక ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు దేవుడికి సంబంధించిన సినిమా షూటింగ్ సమయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది. దేవుడికి తీసే సినిమా నచ్చడం లేదా.. ఎందుకు ఇలా కాంతార చాప్టర్ 1 మూవీ షూటింగ్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఒక్కొక్కరిగా మరణిస్తున్నారు అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: