
ఈ టీజర్ పుష్ప2 మూవీ టీజర్ రికార్డును బ్రేక్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. యూట్యూబ్ లో 138 గంటల పాటు ట్రెండ్ అయినా టీజర్ గా పుష్ప2 టీజర్ నిలవగా అఖండ2 140 గంటల పాటు ట్రెండ్ అయ్యి ఆ రికార్డును బ్రేక్ చేసింది. అఖండ2 సాధించిన ఈ అరుదైన ఘనత అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. టాప్3, టాప్4 స్థానాల్లో జై లవకుశ, జనతా గ్యారేజ్ ఉన్నాయని సమాచారం అందుతోంది.
టాప్4 సినిమాలలో నందమూరి హీరోల సినిమాలే మూడు ఉండటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అఖండ2 సాధించిన ఈ రికార్డు గురించి తెలిసి బాలయ్య క్రేజ్ కు ఇంతకుమించిన ప్రూఫ్ కావాలా? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కేవలం 9 నెలల గ్యాప్ లో బాలయ్య నటించిన రెండు సినిమాలు విడుదల కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబోలో సైతం ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.
బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గోపీచంద్ మలినేని బాలయ్యకు వీరాభిమాని కావడంతో ఈ కాంబినేషన్ పై ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖండ2 తెలుగు టీజర్ కు ఏకంగా 26 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అఖండ2 ఇతర భాషల టీజర్లకు మాత్రం మరీ అద్భుతమైన రెస్పాన్స్ అయితే రాలేదు.