
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమాకి సంబంధించి ఏ అప్డేట్ రిలీజ్ అయినా సోషల్ మీడియాలో విప్పరీతంగా ట్రెండ్ అవుతూ ఉంటుంది . అభిమానులని ఓ రేంజ్ లో ఆకట్టుకునేసుకుంటుంది . ఈ సినిమాలో ఎటువంటి డూప్ లేకుండా నటించబోతున్నాడట ఎన్టీఆర్ . ప్రశాంత్ నీల్ సలహా మేరకే ఈ విధంగా చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ సినిమా అంటేనే భారీ రిస్క్ లతో కూడుకున్న షాట్స్ ఉంటాయి .
అలాంటి రిస్కీ షాట్స్ లేకుండా ఒక పాన్ ఇండియా హీరో నటించడానికి ఓకే చెప్పడం అనేది నిజంగా గ్రేట్ అంటున్నారు జనాలు . అయితే ఇదే మూమెంట్ లో వేరే లెవెల్ లో ఎన్టీఆర్ పేరుని పొగిడిస్తున్నారు . ఇలా ఎన్టీఆర్ డూప్ లేకుండా నిజంగానే నీల్ సినిమాలో నటిస్తే మాత్రం అది వేరే లెవెల్ అంటున్నారు . అంతేకాదు ఈ సినిమా కచ్చితంగా బాహుబలి కి అమ్మ మొగుడి లాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అంటూ ఫ్యాన్స్ ముందు నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా అంతా కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోతుందట. ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం కొన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు..!!