తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన నటిగా కెరియర్ను కొనసాగించిన వారిలో స్నేహ ఒకరు. ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించిన చాలా వరకు పద్ధతి గల పాత్రలో నటించి ప్రేక్షకులను మనసులను దోచుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె సినిమాల్లో హీరోలకు అక్క , వదిన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ హీరోగా రూపొందిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో స్నేహ , ఉపేంద్రకు భార్య పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక రామ్ చరణ్ హీరోగా రూపొందిన వినయ్ విధేయ రామా సినిమాలో రామ్ చరణ్ కు వదిన పాత్రలో స్నేహ నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా ఈ మధ్య కాలంలో ఈమె స్టార్ హీరోల సినిమాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే స్నేహ ఎక్కువ శాతం చీరలలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈమె కట్టిన చీరను మళ్ళీ కట్టదు. అందుకు గల కారణాన్ని కూడా స్నేహ తాజాగా చెప్పుకొచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం గతంలో ఓ మ్యాగజైన్ తన గురించి ఓ న్యూస్ రాస్తూ.. స్నేహ ఎప్పుడు కూడా ధరించిన దుస్తులనే ధరిస్తుందని , అలాగే ఆమెకు వేరే బట్టలు లేవని న్యూస్ రాసిందట.  ఆ సమయంలో తన దుస్తులు మరియు డ్రెస్సింగ్ స్టీల్ మీద చాలా చాలా విమర్శలు వచ్చాయని చెప్పుకొచ్చింది.

దానితో అప్పటి నుంచి ఒక్క సారి కట్టిన చీరను మళ్లీ స్నేహ ముట్టుకోదట. అలా కొన్ని సంవత్సరాల క్రితం ఒక మ్యాగజైన్ వారు స్నేహ కు బట్టలు తక్కువ ఉన్నాయి అని కథనాలు రాయడం , అలాగే కొంత మంది తన డ్రెస్సింగ్ స్టైల్ పై విమర్శలు చేయడంతో ప్రస్తుతం ఈమె ఒక చీరను ఒకే సారి కట్టాలి అని నిర్ణయాన్ని తీసుకున్నట్లు , ఒక సారి కట్టిన చీరను అస్సలు మళ్లీ కట్టకూడదు అని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: