డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టిన కొత్తలో వరుస పెట్టి అద్భుతమైన విజయాలను అందుకొని ఇండస్ట్రీ లో స్టార్ దర్శకుడి స్థాయికి ఎదిగాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం పూరి జగన్నాథ్ కు విజయాలు చాలా తక్కువ శాతం దక్కుతున్నాయి. ఆఖరిగా ఈయన దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన లైజర్ , డబల్ ఇస్మార్ట్ మూవీలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాలను అందుకున్నాయి.

ఇకపోతే పూరీ జగన్నాథ్ తన తదుపరి మూవీ ని తమిళ నటుడు అయినటువంటి విజయ్ సేతుపతి తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ , విజయ్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కొంత కాలం క్రితం పూరి జగన్నాథ్ , విజయ్ సేతుపతి కాంబోలో సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను అనుకుంటున్నారు , ఆల్మోస్ట్ ఇదే టైటిల్ను మేకర్స్ కన్ఫామ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది.

కానీ విజయ్ సేతుపతి ఓ ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ ... పూరి జగన్నాథ్ నాతో తీయబోయే ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ను అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా ఆ సినిమాలో ఏ టైటిల్ను అనుకోలేదు అని క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ టైటిల్ కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ కి భిక్షాందేహి అనే టైటిల్ను అనుకుంటున్నట్లు ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాకు ఏ టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: