
తాజాగా రాజా సాబ్ సినిమా కి సంబంధించిన ఆడియో రైట్స్ సుమారు రూ . 20 కోట్లకు అమ్ముడైపోయినట్టు తెలుస్తుంది . ప్రముఖ టి సిరీస్ సంస్థ రాజా సాబ్ ఆడియో రైట్స్ ను భారీ మొత్తాని కి కొనుగోలు చేసింది .. అలాగే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక్క పాట కూడా బయటి కి రాలేదు .. అయినా కూడా అప్పుడే ఈ స్థాయి లో ఆడియో రైట్స్ అమ్ముడై పోవటం అంటే మామూలు విషయం కాదు . ఇక ఈ సినిమా లో వింటేజ్ ప్రభాస్ తన లుక్స్ తో పర్ఫామెన్స్ తో ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడు . అలాగే ఈ మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ , రిద్ధి కుమార్ వంటి వారు ముఖ్య పాత్ర లో నటిస్తున్నారు .. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు .
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు