- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏ హీరోకి అయినా సరే తన రేంజ్ కి తగ్గ సినిమా పడితే వాళ్ల ఫ్యాన్స్‌కు వ‌చ్చే కిక్కే వేర‌ప్పా అన్న‌ట్టుగా ఉంటుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఇప్పుడు ఆయ‌న రేంజ్‌కు త‌గిన సినిమా కావాల‌ని అందరూ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న సినిమా లు అన్నింటి కంటే ఓజీ మీదే భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇందుకు త‌గిన‌ట్టుగానే ఈ సినిమా కు ఊహించ‌ని రేంజ్‌లో ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఏరియాల వారీగా క‌ళ్లు చెదిరే లెక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి.


ఆంధ్రా లో .. అందులోనూ సీడెడ్ కాకుండా రు. 80 కోట్ల‌కు మేక‌ర్స్ ఓజీ రైట్స్ అమ్మిన‌ట్టు టాక్ ? అస‌లు ఈ లెక్క‌లు వింటుంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌ను అస్స‌లు ఆప‌లేం అంటున్నారు. ఈ నెంబ‌ర్ ను బ‌ట్టే ఓజీ క్రేజ్ ఏ లెవ‌ల్లో ఉందో తెలుస్తోంది. ఒక్క ఈస్ట్ గోదావ‌రి రైట్స్ ఏకంగా రు. 12 కోట్ల రేంజ్ లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయ‌ట‌. ఓజీ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: